![]()
AP Family Card 2025
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేక Family Benefit Card (FBC) అందించడానికి సిద్ధమవుతోంది. ఈ కార్డ్‌లో కుటుంబం పొందిన అన్ని సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, ప్రభుత్వ లబ్ధులు ఒకే చోట నమోదవుతాయి. దీనికి సంబంధించిన డేటాను సేకరించడానికి Unified Family Survey 2025 (UFS) రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ గైడ్‌లో Family Card ప్రయోజనాలు, అర్హత, సర్వే వివరాలు, టైమ్‌లైన్ వంటి అన్ని అంశాలను వివరంగా చూద్దాం.
AP Family Card అంటే ఏమిటీ?
కుటుంబానికి ఒకే ప్రత్యేక గుర్తింపు ఇవ్వడానికి రూపొందించిన డిజిటల్ కార్డు ఇది. వ్యక్తులకు ఆధార్ ఉన్నట్టు — ఇప్పుడు కుటుంబానికి Unique Family ID (UFID) ఉంటుంది. ఈ కార్డ్ ద్వారా:
- కుటుంబం పొందిన Welfare schemes మొత్తం ఒకే చోట కనిపిస్తాయి
- పథకాల పంపిణీలో పారదర్శకత పెరుగుతుంది
- ఫేక్ లబ్ధిదారులు, డూప్లికేట్ కుటుంబాలు తొలగించబడతాయి
- భవిష్యత్తులో పథకాల అర్హత నిర్ధారణ సులభం అవుతుంది
Family Card ప్రధాన లక్ష్యాలు
- ప్రతి కుటుంబానికి సమగ్ర గుర్తింపు రూపొందించడం
- అన్ని పథకాలను ఒకే ప్లాట్‌ఫార్మ్‌కి లింక్ చేయడం
- అర్హులైన వారికే పథకాలు అందేలా చేయడం
- ఫేక్ రికార్డులు, తప్పు Household mapping సమస్యలు తొలగించడం
- ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయాలకు ఖచ్చితమైన డేటా అందించడం
AP Family Card ఎవరికీ లభిస్తుంది?
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసించే ప్రతి కుటుంబానికి
- Household mapping పూర్తయిన కుటుంబాలకు
- Aadhaar వివరాలు సరిగా ఉన్న సభ్యులున్న కుటుంబాలకు
- Unified Family Surveyలో పాల్గొన్నవారికి
Unified Family Survey 2025 (UFS) అంటే ఏమిటి?
APలో ప్రతి కుటుంబానికి సంబంధించిన తాజా వివరాలను సేకరించి Family Card జారీకి సిద్ధం చేసే సమగ్ర సర్వే ఇది. సర్వేలో సేకరించే ముఖ్య వివరాలు:
- కుటుంబ సభ్యుల Aadhaar వివరాలు
- చిరునామా, ఆదాయం, ఆస్తులు
- ఉద్యోగం/విద్య వివరాలు
- ఇప్పటికే పొందుతున్న పథకాలు
- Household structure (నిజమైన సభ్యుల జాబితా)
UFS 2025 ఎందుకు చేస్తున్నరు?
- కుటుంబాలపై ఖచ్చితమైన డేటాబేస్ రూపొందించడానికి
- పథకాల అర్హతను తిరిగి పరిశీలించడానికి
- ఫేక్ బెనిఫిట్స్, డూప్లికేట్ రికార్డులను తొలగించడానికి
- Family Card సరిగ్గా జారీ చేసేందుకు
UFS 2025 ట్రైనింగ్ & టైమ్‌లైన్
- సచివాలయం ఉద్యోగులకు ఇప్పటికే ట్రైనింగ్ ప్రారంభమైంది
- సర్వే 2025 రెండవ వారంలో ప్రారంభం
- డిసెంబర్ 2025 చివరికి పూర్తి చేయాల్సి ఉంటుంది
- Village/Ward Secretariat సిబ్బంది ఇంటింటి సర్వే చేస్తారు
Family Card లభించే ప్రయోజనాలు
- కుటుంబానికి పొందిన అన్ని పథకాల డేటా ఒకే చోట
- సబ్సిడీలు, DBT పంపిణీ మరింత పారదర్శకంగా
- అర్హులైన వారి ఎంపిక ఖచ్చితంగా ఉంటుంది
- పథకాల దుర్వినియోగం తగ్గుతుంది
- ప్రభుత్వ నిర్ణయాలకు Fact-based డేటా అందుతుంది
ఈ సర్వేలో వచ్చే సవాళ్లు
- చాలా కుటుంబాల్లో పాత రికార్డులు సరిగా లేకపోవడం
- Aadhaar–Household mismatch
- Technical issues (App slow / Network)
- ఫ్యామిలీ మార్పులు సరిగ్గా నమోదు కాకపోవడం
చివరి సూచనలు
మీ కుటుంబ రికార్డులు (Aadhaar, మొబైల్, చిరునామా) సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. Unified Family Survey 2025లో పాల్గొని మీ వివరాలను సరిగా నమోదు చేయించుకోవాలి. Family Card భవిష్యత్తులో ముఖ్యమైన డాక్యుమెంట్ అవుతుంది కాబట్టి ఈ సమాచారాన్ని మీ ప్రాంత WhatsApp గ్రూపుల్లో షేర్ చేయండి.










